బెంగాల్‌లో తుపాను బీభత్సం

పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లాలో ఆదివారం ఆకస్మిక తుపాను బీభత్సం సృష్టించింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వడగళ్ల కారణంగా నలుగురు మృత్యువాతపడగా.. మరో 100 మంది వరకు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Published : 01 Apr 2024 05:28 IST

నలుగురి మృతి.. 100 మందికి గాయాలు

జల్‌పాయ్‌గురి: పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లాలో ఆదివారం ఆకస్మిక తుపాను బీభత్సం సృష్టించింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వడగళ్ల కారణంగా నలుగురు మృత్యువాతపడగా.. మరో 100 మంది వరకు గాయపడినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పలు చోట్ల బలమైన గాలులతో పాటు వడగళ్లు పడటంతో అనేక గుడిసెలు ధ్వంసమయ్యాయి. అదేవిధంగా చెట్లు నేలకొరిగాయి. విద్యుత్తు స్తంభాలు కూలిపోవడంతో పలు కాలనీల్లో అంధకారం అలముకుంది. జిల్లా వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని