నా భర్తను చంపితే.. రూ.50 వేలు రివార్డు

భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఓ మహిళ తన భర్తను చంపితే రూ.50వేలు రివార్డు ఇస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

Published : 01 Apr 2024 05:29 IST

వాట్సప్‌ స్టేటస్‌ పెట్టుకున్న వివాహిత

ఆగ్రా: భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఓ మహిళ తన భర్తను చంపితే రూ.50వేలు రివార్డు ఇస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని ఆమె వాట్సప్‌ స్టేటస్‌లో పెట్టింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో చోటుచేసుకుంది. భార్య స్టేటస్‌ చూసి భయపడిన భర్త ఆమె నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించాడు. తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. 2022లో తమ పెళ్లి జరిగిందని, వివాహమైన కొద్ది కాలానికే గొడవలు మొదలయ్యాయని అతడు తెలిపాడు. తన అత్తమామల పక్కింట్లో ఉంటున్న వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని