ఆటో బిల్లు చూసి.. మతిపోయింది ఎటో!

మనం ఆటో లేదా క్యాబ్‌ బుక్‌ చేసుకున్నప్పుడు ఒక్కోసారి మొదట చూపించిన ఛార్జీకి, గమ్యం చేరాక చూపించే రుసుముకు కొంత తేడా ఉంటుంది.

Published : 01 Apr 2024 05:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనం ఆటో లేదా క్యాబ్‌ బుక్‌ చేసుకున్నప్పుడు ఒక్కోసారి మొదట చూపించిన ఛార్జీకి, గమ్యం చేరాక చూపించే రుసుముకు కొంత తేడా ఉంటుంది. అదనంగా రూ.20.. 30 వస్తే సర్లెమ్మని చెల్లిస్తుంటాం. అదే బిల్లు రూ.కోట్లలో వస్తే? దిల్లీ సమీప నొయిడాకు చెందిన వినియోగదారుకు ఇదే అనుభవం ఎదురైంది. దీపక్‌ ఓ ఆటోను బుక్‌ చేసుకున్నపుడు చెల్లించవలసిన మొత్తం రూ.62గా చూపించింది. ప్రయాణం ముగిశాక చూస్తే.. ఏకంగా రూ.7.66 కోట్ల బిల్లు చెల్లించాలని యాప్‌లో నోటిఫికేషను వచ్చింది. నిర్ఘాంతపోవడం దీపక్‌ వంతైంది. ఈ బిల్లు వీడియోను దీపక్‌ స్నేహితుడు ఆశిష్‌ మిశ్ర ‘ఎక్స్‌’లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. కంపెనీ పంపిన బిల్లులో వెయిటింగ్‌ ఛార్జిగా రూ.5,99,09,189 చూపించి, ప్రోత్సాహక రాయితీ ఇచ్చారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో స్పందించిన ఆ సంస్థ ‘ఎక్స్‌’ ద్వారా దీపక్‌కు క్షమాపణలు చెబుతూ బిల్లును సవరిస్తామని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు