ఏమిటీ నిర్లక్ష్య ఆరోపణలు

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మరణానికి సంబంధించి ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన ఓ పిటిషనర్‌పై సోమవారం సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది.

Published : 02 Apr 2024 04:36 IST

నేతాజీ మరణానికి సంబంధించి పిల్‌ వేసిన వ్యక్తిపై మండిపడ్డ సుప్రీం

దిల్లీ: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మరణానికి సంబంధించి ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన ఓ పిటిషనర్‌పై సోమవారం సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. మరణించిన నాయకులపై నిర్లక్ష్య, బాధ్యతారహితమైన ఆరోపణలతో పిటిషన్‌ ఉందని పేర్కొంది. పిటిషనర్‌ తన అభ్యర్థనలో కనీసం మహాత్మా గాంధీని సైతం విడిచిపెట్టలేదని ప్రస్తావించిన ధర్మాసనం, అసలు పిటిషనర్‌ ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ప్రజాహితం కోసం, ప్రజల మానవ హక్కుల కోసం ఏం కృషి చేశారో తెలియజేయాల్సిందిగా పిటిషనర్‌ పినాకపాణి మొహంతిని అడిగింది. ప్రపంచ మానవ హక్కుల భద్రతా సంస్థ (ఇండియా) కటక్‌ జిల్లా కార్యదర్శినని అంతకుముందు పినాకపాణి ధర్మాసనానికి చెప్పారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తులు మీ వెనుక ఎవరున్నారు? మీరు ప్రజాహితం కోసం ఏం చేశారు? ప్రజల మానవ హక్కుల కోసం మీరు ఏంచేశారు? అని నిలదీశారు. మేం మీ చిత్తశుద్ధిని పరీక్షించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సమాజం కోసం, ప్రత్యేకంగా మానవ హక్కుల రంగంలో ఇప్పటివరకు చేసిన కృషిని వివరిస్తూ ప్రమాణపత్రం దాఖలు చేయాల్సిందిగా పిటిషనర్‌ను ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని