కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మరింత కష్టించి పనిచేయాలి

లోక్‌సభ ఎన్నికల తరవాత కొత్త ప్రభుత్వం కొలువుదీరిన మరుసటి రోజు నుంచే మరింత కష్టించి పనిచేసేందుకు ఉన్నతాధికారులంతా సిద్ధంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

Updated : 02 Apr 2024 06:34 IST

ఉన్నతాధికారులకు ప్రధాని మోదీ పిలుపు

ముంబయి: లోక్‌సభ ఎన్నికల తరవాత కొత్త ప్రభుత్వం కొలువుదీరిన మరుసటి రోజు నుంచే మరింత కష్టించి పనిచేసేందుకు ఉన్నతాధికారులంతా సిద్ధంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల తరవాత నూతన సర్కార్‌ ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేస్తూ..ఆర్థికంగా దేశాన్ని మరింత స్వావలంబన దిశగా తీసుకెళ్లేందుకు కార్యాచరణను ప్రారంభిస్తామని మోదీ పేర్కొన్నారు. ‘‘ఇప్పుడు 100 రోజుల ఎన్నికల క్రతువులో తీరికలేకుండా ఉన్నాను. కొత్త సర్కార్‌ ప్రమాణస్వీకారం చేసిన తరవాత రోజు నుంచే ఎక్కువ పనిచేయడాన్ని ప్రారంభించాలి. ఈ విషయంపై మీరూ ఆలోచించండి. అందుకోసం మీకు తగిన సమయం ఉంది’’ అని రిజర్వు బ్యాంక్‌ 90వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని