భాజపా ప్రచార వీడియోపై మహిళా సంఘాల ఆక్షేపణ

పెళ్లి చూపులకు వచ్చిన ఇండియా కూటమి నేతలు ఆ వధువు కోసం తమలో తాము కొట్లాడుకుంటున్న ఇతివృత్తంతో వ్యంగ్యంగా రూపొందించిన భాజపా ప్రచార వీడియోపై వామపక్ష మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి.

Published : 02 Apr 2024 04:59 IST

యువతులను కించపరిచేలా ఉందని ధ్వజం
ఉపసంహరించుకోవాలని డిమాండ్‌

దిల్లీ: పెళ్లి చూపులకు వచ్చిన ఇండియా కూటమి నేతలు ఆ వధువు కోసం తమలో తాము కొట్లాడుకుంటున్న ఇతివృత్తంతో వ్యంగ్యంగా రూపొందించిన భాజపా ప్రచార వీడియోపై వామపక్ష మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఆ ప్రచార వీడియోను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశాయి. దీనికి సంబంధించిన ప్రకటనపై అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఏఐడీడబ్ల్యూఏ), భారతీయ మహిళల జాతీయ సమాఖ్య(ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ), అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం(ఏఐపీడబ్ల్యూఏ), పీఓడబ్ల్యూ-పీఎంఎస్‌-ఐజేఎంలతో కూడిన అఖిల భారత సమన్వయ కమిటీ నేతలు సంతకాలు చేశారు. దేశంలోని మహిళలను కించపరిచేలా, మనువాద భావజాలానికి ప్రతీకగా భాజపా ప్రచార వీడియో ఉందని మహిళా నేతలు విమర్శించారు. వధువు కోసం కలహించుకునే వారిగా ఇండియా కూటమి నేతలను చిత్రీకరించడం దారుణమని మహిళా సంఘాల నేతలు తెలిపారు. పలు విపక్ష పార్టీలు కూడా భాజపా ప్రచార వీడియోపై తీవ్ర అభ్యంతరం తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని