వీవీ ప్యాట్‌ స్లిప్‌ల లెక్కింపు పిటిషన్‌పై స్పందన తెలియజేయండి

ఎన్నికల కౌంటింగ్‌లో మొత్తం వీవీ ప్యాట్‌ స్లిప్‌లను లెక్కించాలని దాఖలైన పిటిషన్‌పై స్పందన తెలియజేయాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Published : 02 Apr 2024 05:04 IST

కేంద్రం, ఈసీలకు సుప్రీంకోర్టు ఆదేశం

దిల్లీ: ఎన్నికల కౌంటింగ్‌లో మొత్తం వీవీ ప్యాట్‌ స్లిప్‌లను లెక్కించాలని దాఖలైన పిటిషన్‌పై స్పందన తెలియజేయాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సామాజిక కార్యకర్త అరుణ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ ఆదేశాలిచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి, ఈసీకి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ మే 17వ తేదీన జరిగే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని