భోజ్‌శాల కాంప్లెక్స్‌ సర్వే నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరణ

మధ్యప్రదేశ్‌ ధార్‌ జిల్లాలోని మధ్యయుగం నాటి కట్టడం భోజ్‌శాల కాంప్లెక్స్‌ సర్వే పనుల నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Published : 02 Apr 2024 05:10 IST

దిల్లీ: మధ్యప్రదేశ్‌ ధార్‌ జిల్లాలోని మధ్యయుగం నాటి కట్టడం భోజ్‌శాల కాంప్లెక్స్‌ సర్వే పనుల నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, భారత పురావస్తు విభాగం (ఏఎస్‌ఐ) సర్వే నివేదిక ఎలా ఉన్నప్పటికీ దాని ఆధారంగా తమ అనుమతి లేనిదే ఎటువంటి చర్యలకు ఉపక్రమించరాదని జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ పి.కె.మిశ్రలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ కట్టడం స్వరూపాన్ని మార్చేలా తవ్వకాలు జరపరాదని ఆదేశించింది. దీనికి సంబంధించి కేంద్రం, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం, ఏఎస్‌ఐలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది. భోజ్‌శాలలో శాస్త్రీయ సర్వే నిర్వహణకు మధ్యప్రదేశ్‌ హైకోర్టు మార్చి 11న అనుమతించగా...మౌలానా కమాలుద్దీన్‌ వెల్ఫేర్‌ సొసైటీ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేసింది.

జ్ఞానవాపీలో పూజల కొనసాగింపునకు సుప్రీం సమ్మతి

వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు ప్రాంగణ లోపలి భాగాల్లో హిందువులు, ముస్లింల మత సంబంధ క్రతువులు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. వీటిని యథాతథంగా కొనసాగించుకోవచ్చని తెలిపింది. జ్ఞానవాపీ మసీదు దక్షిణ నేలమాళిగలో ఇటీవల అనుమతించిన హిందువుల పూజలను నిలిపివేసేలా(స్టే) ఉత్తర్వులివ్వాలన్న అభ్యర్థనను సోమవారం తోసిపుచ్చుతూ ఈ వ్యాఖ్యలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని