5 రాష్ట్రాల్లో 23 మంది అధికారులపై ఈసీ వేటు

ఎన్నికల వేళ విధి నిర్వహణలో అలసత్వం చూపిన 23 మంది ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు చేపట్టింది.

Updated : 03 Apr 2024 05:46 IST

ఈనాడు, దిల్లీ: ఎన్నికల వేళ విధి నిర్వహణలో అలసత్వం చూపిన 23 మంది ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు చేపట్టింది. అస్సాం, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఐజీలు, డీసీపీ, 12 మంది ఎస్పీలు, 8 మంది జిల్లా కలెక్టర్లను బదిలీ చేయాలంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అధికారులందరూ తక్షణం విధుల నుంచి తప్పుకొని ఆ బాధ్యతలను తమ కింద ఉన్న అధికారికి అప్పగించాలని ఆదేశించింది. వీరిలో ఎవరికీ 2024 సాధారణ ఎన్నికల బాధ్యతలు అప్పగించకూడదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నిర్దేశించింది. బదిలీ అయినవారి స్థానంలో కొత్త నియామకాల కోసం ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల పేర్లతో కూడిన ప్యానల్‌ను తమకు పంపాలని ఈసీ పై అయిదు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని