విదేశీ వైద్య పట్టభద్రులకూ స్టైపెండ్‌ చెల్లించాల్సిందే

మన దేశంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ చదివిన వారితో సమానంగానే విదేశీ వైద్య పట్టభద్రులను చూడాలని, ఇంటర్న్‌షిప్‌లో స్టైపెండ్‌ చెల్లింపులోనూ వేర్వేరుగా పరిగణించరాదని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Published : 03 Apr 2024 03:12 IST

వైద్య కళాశాలలకు సుప్రీం స్పష్టీకరణ

దిల్లీ: మన దేశంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ చదివిన వారితో సమానంగానే విదేశీ వైద్య పట్టభద్రులను చూడాలని, ఇంటర్న్‌షిప్‌లో స్టైపెండ్‌ చెల్లింపులోనూ వేర్వేరుగా పరిగణించరాదని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కొన్ని వైద్య కళాశాలల్లో విదేశీ వైద్య పట్టభద్రులకు ఇంటర్న్‌షిప్‌లో స్టైపెండ్‌ మంజూరు చేయడంలేదని ఓ వైద్యుల బృందం తరఫు న్యాయవాది తన్వీ దుబే... జస్టిస్‌ సుధాంశు ధూలియా, జస్టిస్‌ ప్రసన్న బాలచంద్ర సభ్యులుగా ఉన్న ధర్మాసనానికి తెలిపారు. విదేశీ వైద్య విద్యార్థులకు స్టైపెండ్‌ చెల్లించ నిరాకరించిన కళాశాలల వివరాలను తమకు అందజేయాలని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ)ని ధర్మాసనం ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని