ఎన్నికల్లో అసత్య ప్రచారానికి కొత్త వెబ్‌సైట్‌తో చెక్‌

లోక్‌సభ ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ‘మిథ్‌ వర్సెస్‌ రియాలిటీ రిజిస్టర్‌’ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది.

Published : 03 Apr 2024 04:41 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ‘మిథ్‌ వర్సెస్‌ రియాలిటీ రిజిస్టర్‌’ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీనిని మంగళవారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్‌బీర్‌సింగ్‌ సంధు ప్రారంభించారు. అసత్య కథనాల వ్యాప్తిని అడ్డుకొని.. ఎన్నికల సమయంలో ప్రజలకు ధ్రువీకరించిన కచ్చితమైన సమాచారం అందించే దిశగా దీనిని రూపొందించినట్లు ఈసీ వెల్లడించింది. ప్రజలు ఎప్పటికప్పుడు అడిగే ప్రశ్నలను, వెలుగులోకి వచ్చిన నకిలీ సమాచారాన్ని ఈ రిజిస్టరు ద్వారా అప్‌డేట్‌ చేస్తూ ఓటర్లకు తెలుపుతామని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని