సంజయ్‌ సింగ్‌కు బెయిల్‌

దేశ రాజధాని దిల్లీలో మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆరు నెలల క్రితం అరెస్టయిన (ఆమ్‌ ఆద్మీ పార్టీ) ఆప్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌కు సుప్రీం కోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది.

Published : 03 Apr 2024 03:14 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆరు నెలల క్రితం అరెస్టయిన (ఆమ్‌ ఆద్మీ పార్టీ) ఆప్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌కు సుప్రీం కోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌, జస్టిస్‌ వరాలే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సంజయ్‌సింగ్‌కు బెయిలిస్తూ ట్రయల్‌ కోర్టు విధించిన షరతులకు లోబడి నడుచుకోవాలని ఆదేశించింది. మరోవైపు రాజకీయ కార్యకలాపాల్లోనూ పాల్గొనేందుకు అనుమతిచ్చింది. సంజయ్‌కు బెయిల్‌ ఇవ్వడంపై ఈడీ కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. తనకు బెయిల్‌ రావడంపై సంజయ్‌ స్పందిస్తూ..‘దేశంలోని ప్రజాస్వామ్యానికి, ఆశావహదృక్పథానికి ఈ రోజు గొప్ప శుభదినం’ అంటూ అభివర్ణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని