జైలులో కేజ్రీవాల్‌కు నిద్రలేని రాత్రి

మద్యం కుంభకోణం కేసులో జ్యుడిషియల్‌ కస్టడీలో భాగంగా తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం రాత్రి కేవలం కొద్దిసేపు మాత్రమే నిద్రపోయారని, ఆయన రక్తంలో చక్కెర స్థాయి తీవ్రంగా పడిపోయిందని మంగళవారం జైలు అధికారులు వెల్లడించారు.

Published : 03 Apr 2024 04:42 IST

పడిపోయిన చక్కెర స్థాయి
ఇంటి భోజనానికి అనుమతి

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో జ్యుడిషియల్‌ కస్టడీలో భాగంగా తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం రాత్రి కేవలం కొద్దిసేపు మాత్రమే నిద్రపోయారని, ఆయన రక్తంలో చక్కెర స్థాయి తీవ్రంగా పడిపోయిందని మంగళవారం జైలు అధికారులు వెల్లడించారు. కేజ్రీవాల్‌ అర్ధరాత్రి వరకూ సెల్‌లో అటు, ఇటు తిరుగుతూ కనిపించారని, కొద్దిసేపు ఆయన కటిక నేలపైనే పడుకున్నారని చెప్పారు. మంగళవారం ఉదయం ఆయనకు టీ, రెండు బిస్కట్లు అందించి మరోమారు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కేజ్రీవాల్‌కు చక్కెరస్థాయి 50కు చేరుకుందని, వైద్యుల సూచనలతో ఆయనకు మందులు సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చేవరకు ప్రతిరోజు మధ్యాహ్నం, రాత్రి భోజనంగా ఇంటి నుంచి వచ్చిన ఆహారాన్ని అనుమతించారు. సెల్‌ బయట జైలు అధికారితోపాటు ఇద్దరు భద్రతా సిబ్బందిని నియమించారు. అత్యవసనర సేవల సిబ్బందినీ సెల్‌ సమీపంలో సిద్ధంగా ఉంచారు. సీసీకెమెరాల ద్వారా ఆయన్ను ఎప్పటికప్పుడు జైలు అధికారులు గమనిస్తున్నారు. జైల్లో ఆయనకు ఓ పరుపు, దుప్పట్లు, రెండు దిండ్లు సమకూర్చినట్లు సమాచారం.

భార్యతో వీసీలో మాట్లాడిన కేజ్రీవాల్‌

కేజ్రీవాల్‌ మంగళవారం తిహాడ్‌ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ (వీసీ) ద్వారా తన భార్య సునీతతో మాట్లాడారు. మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల మధ్య వీసీని ఏర్పాటు చేసినట్లు కారాగారం అధికారులు వెల్లడించారు. అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటలకు కేజ్రీవాల్‌ తన న్యాయవాదితో కొన్ని నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని