న్యాయవాదుల ప్యానళ్ల మార్పుతో కోర్టుల విధులకు భంగం కలగనివ్వొద్దు

రాష్ట్రాల్లో అధికారం చేతులు మారినప్పుడల్లా కొత్త ప్రభుత్వాలు న్యాయవాదుల ప్యానళ్లలో మార్పులు చేయడం సహజమేనని, ఆ అధికారం వాటికి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది.

Published : 03 Apr 2024 04:38 IST

రాష్ట్రాలకు సర్వోన్నత న్యాయస్థానం సూచన

దిల్లీ: రాష్ట్రాల్లో అధికారం చేతులు మారినప్పుడల్లా కొత్త ప్రభుత్వాలు న్యాయవాదుల ప్యానళ్లలో మార్పులు చేయడం సహజమేనని, ఆ అధికారం వాటికి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, న్యాయస్థానాల విధులకు ఆటంకం కలగని విధంగా ఆ మార్పులుండాలని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. కొత్త న్యాయవాదుల ప్యానళ్లు వచ్చిన ప్రతిసారి ఆ కారణంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కేసుల్లో వాయిదాలు కోరడం పరిపాటి అవుతోందని పేర్కొంది. కనుక పాత ప్యానళ్లను కనీసం ఆరు వారాల పాటైనా కొనసాగిస్తే...విచారణలను తప్పనిసరిగా వాయిదా వేయాల్సిన పరిస్థితిని కొంత వరకైనా నివారించవచ్చని ఓ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని