కచ్చతీవుపై దుందుడుకు ప్రకటనలతో శ్రీలంక ప్రభుత్వం, తమిళుల మధ్య ఘర్షణ!

కచ్చతీవు ద్వీపంపై 50 ఏళ్ల తర్వాత చేస్తున్న అవాస్తవ, దుందుడుకు ప్రకటనలు శ్రీలంక ప్రభుత్వం, 35 లక్షల మంది తమిళుల మధ్య ఘర్షణలకు దారితీసే ప్రమాదముందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి.చిదంబరం పేర్కొన్నారు.

Published : 03 Apr 2024 06:18 IST

కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం

దిల్లీ: కచ్చతీవు ద్వీపంపై 50 ఏళ్ల తర్వాత చేస్తున్న అవాస్తవ, దుందుడుకు ప్రకటనలు శ్రీలంక ప్రభుత్వం, 35 లక్షల మంది తమిళుల మధ్య ఘర్షణలకు దారితీసే ప్రమాదముందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి.చిదంబరం పేర్కొన్నారు. ఈ మేరకు భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని మంగళవారం ఆయన హెచ్చరించారు. భారత్‌-శ్రీలంకల మధ్య సంబంధాలకు మచ్చ తెచ్చే ప్రకటన చేయడానికి ముందు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌, ఇతరులు.. శ్రీలంకలో 25 లక్షల మంది శ్రీలంక తమిళులు, 10 లక్షల మంది భారతీయ తమిళులు ఉన్న సంగతిని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో ఓ పోస్టు ఉంచారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉన్న సమయంలోనే చైనా 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని, దానిని పటిష్ఠ పరుస్తోందని చిదంబరం చెప్పారు. ‘‘సరిహద్దుల్లోని గ్రామాలు, కీలక ప్రాంతాలకు పేర్లు పెట్టే పనిని చైనా మళ్లీ మొదలుపెట్టింది. దీనిపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎందుకు స్పందించరు’’ అని నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని