మీ గుర్తు న్యాయపరిధిలో ఉందని తెలిపారా? : సుప్రీం

కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఎన్నికల ప్రచార ప్రకటనల్లో గడియారం గుర్తు న్యాయపరిధిలో ఉందని ప్రకటించారా లేదా అని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) అజిత్‌ పవార్‌ వర్గాన్ని బుధవారం సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

Published : 04 Apr 2024 03:26 IST

ప్రచార ప్రకటనలను సమర్పించండి
అజిత్‌ పవార్‌ వర్గానికి ఆదేశం

దిల్లీ: కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఎన్నికల ప్రచార ప్రకటనల్లో గడియారం గుర్తు న్యాయపరిధిలో ఉందని ప్రకటించారా లేదా అని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) అజిత్‌ పవార్‌ వర్గాన్ని బుధవారం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి గత నెల 19న తాము జారీచేసిన ఉత్తర్వులను ప్రస్తావిస్తూ.. ఆ రోజు తర్వాత జారీ చేసిన ఎన్నికల ప్రచార ప్రకటనలను తమకు సమర్పించాలని ఆదేశించింది. అజిత్‌ పవార్‌ వర్గాన్ని ఎన్నికల సంఘం అసలైన ఎన్‌సీపీగా గుర్తించి.. పార్టీ అధికారిక గుర్తు గడియారాన్ని కేటాయించింది. దీన్ని ఎన్‌సీపీ శరద్‌పవార్‌ వర్గం సుప్రీంలో సవాల్‌ చేసింది.విచారణలో భాగంగా గడియారం గుర్తును ప్రచారం చేసుకునేటప్పుడు ఈ అంశం న్యాయపరిధిలో ఉందన్న విషయాన్ని పేర్కొనాలని అజిత్‌ వర్గానికి గత నెల 19న న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించారని శరద్‌పవార్‌ వర్గం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని