12 మంది రాజ్యసభ సభ్యుల ప్రమాణం

ఎగువసభకు ఇటీవల ఎన్నికైన 12 మంది సభ్యులతో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేయించారు.

Published : 04 Apr 2024 03:27 IST

దిల్లీ: ఎగువసభకు ఇటీవల ఎన్నికైన 12 మంది సభ్యులతో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేయించారు. పార్లమెంటు హౌస్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నూతన సభ్యులు ధర్మశీలా గుప్తా, మనోజ్‌కుమార్‌ ఝా, సంజయ్‌ యాదవ్‌, గోవింద్‌భాయ్‌ లాల్జీభాయ్‌ ధోలాకియా, సుభాష్‌ చందర్‌, హర్ష్‌ మహాజన్‌, జి.సి.చంద్రశేఖర్‌, ఎల్‌.మురుగన్‌, అశోక్‌ సింగ్‌, చంద్రకాంత్‌ హందోరే, మేధా విశ్రమ్‌ కులకర్ణి, సాధనా సింగ్‌ ప్రమాణం చేశారు. రాజ్యసభ సభ్యులుగా వీరి పదవీ కాలం బుధవారం నుంచి ప్రారంభమైంది. రాజ్యసభ డిప్యూటీ¨ ఛైర్మన్‌ హరివంశ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 2, 3 తేదీల్లో 54 మంది రాజ్యసభసభ్యులు పదవీ విరమణ చేశారు.

మన్మోహన్‌కు పలువురి ప్రశంసలు

రాజ్యసభ సభ్యుడిగా 33 ఏళ్ల పాటు కొనసాగిన మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ దేశ ప్రయోజనాల విషయంలో ఎన్నడూ రాజీ పడలేదని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొనియాడారు. రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్‌ సింగ్‌ పదవీ కాలం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా పలువురు నేతలు...ప్రధానిగా పదేళ్ల పాటు, రాజ్యసభ సభ్యుడిగా 33 ఏళ్ల పాటు సేవలందించిన మన్మోహన్‌ కృషిని గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని