మద్యంపై రాష్ట్రాలదే సంపూర్ణాధికారం

మద్యం తయారీ, సరఫరా, నియంత్రణ సంబంధిత అధికారాలన్నీ రాష్ట్రాలకే చెందుతాయని, ఈ అంశంలో కేంద్రం ప్రమేయం ఉండరాదని ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులోవాదించాయి.

Published : 04 Apr 2024 03:27 IST

సుప్రీంకోర్టులో యూపీ, బెంగాల్‌ ప్రభుత్వాల వాదనలు

దిల్లీ: మద్యం తయారీ, సరఫరా, నియంత్రణ సంబంధిత అధికారాలన్నీ రాష్ట్రాలకే చెందుతాయని, ఈ అంశంలో కేంద్రం ప్రమేయం ఉండరాదని ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులోవాదించాయి. అది ఇండస్ట్రియల్‌ లిక్కర్‌ అయినా, సాధారణ మద్యమైనా సరే...రెండింటికి సంబంధించిన సంపూర్ణ శాసనాధికారం రాష్ట్రాలదేనని, న్యాయస్థానాల పరిధిలోకీ రాదని తెలిపాయి. మద్యంపై అధికారాల విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య స్పష్టతకు సంబంధించి దాఖలైన వ్యాజ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని 9 మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఏడుగురు సభ్యుల ధర్మాసనం 1997లో రాష్ట్రాలకు వ్యతిరేకంగా తీర్పునివ్వడంతో దానిని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లు 2010లో 9 మంది సభ్యుల ధర్మాసనం ముందుకు వచ్చాయి. ఈ కేసులో గురువారం కూడా విచారణ కొనసాగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని