సుశీల్‌ కుమార్‌ మోదీకి క్యాన్సర్‌

భాజపా సీనియర్‌ నేత, బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ (72) క్యాన్సర్‌ బారిన పడ్డారు. ఆరు నెలలుగా తాను క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు బుధవారం ఆయనే స్వయంగా ప్రకటించారు.

Published : 04 Apr 2024 05:06 IST

పట్నా: భాజపా సీనియర్‌ నేత, బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ (72) క్యాన్సర్‌ బారిన పడ్డారు. ఆరు నెలలుగా తాను క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు బుధవారం ఆయనే స్వయంగా ప్రకటించారు. ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఎన్నికల ప్రక్రియలో భాగం కాలేకపోతున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీతో పంచుకున్నానని.. దేశానికి, బిహార్‌ ప్రజలకు, పార్టీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని ‘ఎక్స్‌’లో తెలిపారు. దీనిపై స్పందించిన బిహార్‌ ఉప ముఖ్యమంత్రి విజయ్‌ కుమార్‌ సిన్హా.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో ఏర్పాటైన భాజపా ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో సుశీల్‌ సభ్యుడిగా ఉన్నారు. అయితే, తాజా ప్రకటనతో ఆయన ఈ కమిటీ వ్యవహారాల నుంచి కూడా వైదొలగనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని