చట్టాలను ఉల్లంఘించిన ఐదు ఎన్జీవోల రిజిస్ట్రేషన్లు రద్దు

విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలోని నిబంధనలను ఉల్లఘించినందుకు ఐదు స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోల) రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

Published : 04 Apr 2024 04:44 IST

దిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలోని నిబంధనలను ఉల్లఘించినందుకు ఐదు స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోల) రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. సీనోడికల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సోషల్‌ సర్వీస్‌, వాలంటరీ హెల్త్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఇండో గ్లోబల్‌ సోషల్‌ సర్వీస్‌ సొసైటీ, ఆగ్జిలరీ ఫర్‌ సోషల్‌ యాక్షన్‌, ఎవాంజెలికల్‌ ఫెలోషిప్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలు ఇకపై విదేశీ విరాళాలు స్వీకరించలేవు, ఉన్న వాటినీ ఉపయోగించుకోలేవు. తమ పరిధిలో లేని పనులకు నిధులు ఉపయోగించారనే ఆరోపణలతో కేంద్రం ఈ చర్య తీసుకుంది. గత పదేళ్లలో 20,693 ఎన్జీవోల లైసెన్సులను కేంద్రం రద్దు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని