అయోధ్య బాల రాముడికి కానుకగా 7 కిలోల బంగారు రామాయణం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య బాల రాముడికి ఓ భక్తుడు సుమారు రూ.5 కోట్ల విలువ చేసే ఏడు కిలోల ‘బంగారు రాణాయణాన్ని’ కానుకగా ఇచ్చారు.

Updated : 11 Apr 2024 10:41 IST

ఈటీవీ భారత్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య బాల రాముడికి ఓ భక్తుడు సుమారు రూ.5 కోట్ల విలువ చేసే ఏడు కిలోల ‘బంగారు రామాయణాన్ని’ కానుకగా ఇచ్చారు. 500 బంగారు పేజీలపై రాసిన ఈ రామాయణాన్ని అయోధ్య ప్రధానాలయంలో ఉంచారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠ సమయంలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ్‌ తన జీవిత సంపాదన మొత్తాన్ని బాల రాముడికి అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆ మాట ప్రకారం ఆయన రూ.5 కోట్లు ఖర్చు చేసి 151 కిలోల బరువున్న రామచరిత మానస్‌(రామాయణం)ను సిద్ధం చేయించారు. 10,902 శ్లోకాలతో కూడిన ఈ బంగారు రామాయణానికి సంబంధించిన ప్రతి పేజీపై 24 క్యారెట్ల బంగారు పూత పూశారు.  దీని తయారీలో 140 కిలోల రాగిని కూడా వినియోగించారు. మరోవైపు రామమందిరంలో కలశ స్థాపనతో 9 రోజుల శ్రీ రామనవమి వేడుకలు ప్రారంభం అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని