సైబర్‌ నేరాల్లో భారత్‌ది 10వ స్థానం

సైబర్‌ నేరాల విషయంలో భారత్‌.. ప్రపంచంలోనే 10వ స్థానంలో ఉంది. ఇక్కడ ముందుగానే రుసుములు చెల్లింపులు జరిపించేలా చేసే మోసాలు ఎక్కువని తాజా అధ్యయనం తేల్చింది.

Published : 12 Apr 2024 05:21 IST

రష్యా నంబర్‌ వన్‌

దిల్లీ: సైబర్‌ నేరాల విషయంలో భారత్‌.. ప్రపంచంలోనే 10వ స్థానంలో ఉంది. ఇక్కడ ముందుగానే రుసుములు చెల్లింపులు జరిపించేలా చేసే మోసాలు ఎక్కువని తాజా అధ్యయనం తేల్చింది. దాదాపు 100 దేశాలపై పరిశీలన జరిపిన అంతర్జాతీయ నిపుణుల బృందం.. ‘ప్రపంచ సైబర్‌నేర సూచీ’ని రూపొందించింది. ఇందులో వివిధ విభాగాల్లో సైబర్‌ నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించింది.

ఈ సర్వే ద్వారా పరిశోధకులు వర్చువల్‌ ప్రపంచంలో జరుగుతున్న ప్రధాన నేరాలను పరిగణనలోకి తీసుకొని.. అవి ఎక్కువగా జరుగుతున్న దేశాల పేర్లను ఇవ్వాలని అంతర్జాతీయ నిపుణులకు సూచించారు. పరిశోధకులు గుర్తించిన ప్రధాన విభాగాల్లో మాల్‌వేర్‌ వంటి సాంకేతిక ఉత్పత్తులు, సర్వీసులు; సైబర్‌ దాడులు, రాన్సమ్‌వేర్‌ సహా డబ్బు తస్కరణ, డేటా చౌర్యం, హ్యాకింగ్‌; ఖాతాలు, క్రెడిట్‌ కార్డుల వివరాల తస్కరణ, ముందస్తు చెల్లింపు మోసాలు, అక్రమ వర్చువల్‌ కరెన్సీతో కూడిన మనీ లాండరింగ్‌ వంటివి ఉన్నాయి. తాజా పరిశోధనలో వెల్లడైన అంశాలివీ.. 

  • జాబితాలో రష్యా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఉక్రెయిన్‌, చైనా, అమెరికా, నైజీరియా, రొమేనియా, ఉత్తర కొరియా, బ్రిటన్‌, బ్రెజిల్‌ ఉన్నాయి.
  • రష్యా, ఉక్రెయిన్‌లు ఉన్నతస్థాయి సాంకేతిక సైబర్‌నేరాల హబ్‌గా ఉండగా.. నైజీరియా సైబర్‌ నేరగాళ్లు మాత్రం సాంకేతికంగా ఒకింత తక్కువ స్థాయిని కలిగి ఉన్నారు.
  •  కొన్ని దేశాల్లో సైబర్‌ నేరగాళ్లు ఒక మోస్తరు స్థాయి సైబర్‌ నేరాల రకాల్లో ‘ప్రావీణ్యాన్ని’ ప్రదర్శిస్తున్నారు. కొన్ని దేశాల్లోని వారు  మాత్రం అటు హైటెక్‌, ఇటు లోటెక్‌ నేరాల్లోనూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
  • భారత్‌లో సైబర్‌స్కామ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. మన దేశం ‘సమతౌల్య హబ్‌’గా ఉంది. ఇక్కడ ఒక మోస్తరు స్థాయి సాంకేతిక నేరాలు చోటుచేసుకుంటున్నాయి. రొమేనియా, అమెరికాల్లో మాత్రం హైటెక్‌, లోటెక్‌ నేరాలు చోటుచేసుకుంటున్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు