మాజీ భర్తకు భరణం చెల్లించండి

అనారోగ్యం కారణంగా సంపాదించలేని ఓ వ్యక్తికి అతని మాజీ భార్య నెలకు రూ.10 వేల చొప్పున భరణం చెల్లించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది.

Updated : 12 Apr 2024 05:50 IST

ఓ మహిళకు బాంబే హైకోర్టు ఆదేశం

ముంబయి: అనారోగ్యం కారణంగా సంపాదించలేని ఓ వ్యక్తికి అతని మాజీ భార్య నెలకు రూ.10 వేల చొప్పున భరణం చెల్లించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. అనారోగ్యం, వైద్యపరమైన ఇబ్బందుల కారణంగా ఆ వ్యక్తి జీవనోపాధి పొందే స్థితిలో లేరని, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 24 ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి ఆదాయ వనరు ఉన్న జీవిత భాగస్వామి(స్పౌస్‌) మధ్యంతర భరణం చెల్లించాలని హైకోర్టు పేర్కొంది. దీని ప్రకారం బ్యాంకు మేనేజరుగా పనిచేస్తున్న ఆ మహిళ తన మాజీ భర్తకు రూ.10వేలు భరణం చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు అంతకుముందు సివిల్‌కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన హైకోర్టు దాన్ని సవాల్‌ చేస్తూ ఆ మహిళ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని