ఈపీఎఫ్‌వో గరిష్ఠ వేతన పరిమితి రూ.21 వేలు!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం యోచిస్తోంది.

Published : 12 Apr 2024 05:13 IST

పెంచే యోచనలో కేంద్రం

దిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం ఇది రూ.15వేలుగా ఉండగా, ఆ మొత్తాన్ని కనీసం రూ.21వేలకు పెంచాలని భావిస్తోంది. గత కొన్నేళ్లుగా ఈ పరిమితిని పెంచాలని డిమాండ్లు ఉన్నాయి. తాజాగా మరోసారి దీనిపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని, కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నట్లు తెలిపింది. ఈపీఎఫ్‌వో గరిష్ఠ వేతన పరిమితిని చివరిసారిగా 2014లో సవరించారు. అప్పట్లో రూ.6,500 ఉండగా, ఆ మొత్తాన్ని రూ.15 వేలకు పెంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని