సైనిక స్కూళ్లపై కాంగ్రెస్‌ ఆరోపణల్ని తోసిపుచ్చిన కేంద్రం

దేశంలోని సైనిక్‌ స్కూళ్లను ప్రైవేటీకరించే యోచనను కేంద్రం విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాయడంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది.

Updated : 12 Apr 2024 05:44 IST

దిల్లీ: దేశంలోని సైనిక్‌ స్కూళ్లను ప్రైవేటీకరించే యోచనను కేంద్రం విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాయడంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ‘రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో స్వతంత్ర సంస్థ ద్వారా రాజకీయాలకు దూరంగా పనిచేసే సైనిక స్కూళ్లను ప్రైవేటీకరిస్తే వాటి స్వభావంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఒక సిద్ధాంతాన్ని వీటి ద్వారా విద్యార్థులపై రుద్దే ప్రయత్నం తగదు. ప్రైవేటీకరణ ఒప్పందాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలి’ అని ఖర్గే తన లేఖలో తెలిపారు. ఈ ఆరోపణలు అసంబద్ధమైనవి, తప్పుదోవ పట్టించేవని పేర్కొంటూ రక్షణ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. విద్యారంగంలో అనుభవం ఉన్న సంస్థలతో 100 పాఠశాలలను ఏర్పాటు చేసే పథకాన్ని కేంద్రం ప్రారంభించిందని తెలిపింది. కఠినమైన ఎంపిక ప్రక్రియ ద్వారా 500 దరఖాస్తులను స్కాన్‌ చేయగా.. 45 పాఠశాలలకు మాత్రమే ఆమోదం లభించిందని పేర్కొంది. అది కూడా తాత్కాలికమేనని, వాటిపై పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని