సౌదీ జైలు నుంచి కేరళ వ్యక్తిని విడిపించేందుకు రూ.34 కోట్ల సమీకరణ

సౌదీ అరేబియాలో మరణశిక్ష ఎదుర్కొంటున్న వ్యక్తిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయులు ఏకంగా రూ.34 కోట్లు సమీకరించి పెద్దమనసు చాటుకున్నారు.

Published : 13 Apr 2024 06:07 IST

కోజికోడ్‌: సౌదీ అరేబియాలో మరణశిక్ష ఎదుర్కొంటున్న వ్యక్తిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయులు ఏకంగా రూ.34 కోట్లు సమీకరించి పెద్దమనసు చాటుకున్నారు. కేరళలోని కోజికోడ్‌కు చెందిన అబ్దుల్‌ రహీమ్‌ సౌదీలో ప్రత్యేక అవసరాల సౌదీ బాలుడికి సంరక్షకుడిగా (కేర్‌ టేకర్‌) ఉండేవాడు. 2006లో పొరపాటున అతను చనిపోవడానికి కారణమయ్యాడు. అప్పటి నుంచి జైల్లో మగ్గుతున్నాడు. మరోవైపు, బాలుడి కుటుంబం క్షమాభిక్షకు అంగీకరించకపోవడంతో.. 2018లో అబ్దుల్‌కు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. నిందితుడి తరఫు అభ్యర్థనలనూ న్యాయస్థానం తిరస్కరించింది. అనంతరం కొన్నాళ్లకు.. ‘బ్లడ్‌ మనీ’ చెల్లిస్తే క్షమించేందుకు బాధిత కుటుంబం అంగీకరించింది. ఈ క్రమంలోనే ఈ నెల 18లోగా సుమారు రూ.34 కోట్లు చెల్లించినట్లైతే మరణశిక్ష తప్పే అవకాశముంది. దీంతో ఆ మొత్తం సమీకరించి రహీమ్‌ను విడిపించేందుకు ఓ కార్యాచరణ బృందం నిధుల సమీకరణ మొదలు పెట్టింది. పారదర్శకత కోసం ప్రత్యేకంగా యాప్‌ను సైతం రూపొందించింది. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం వరకు కూడా.. కొద్ది మొత్తమే పోగైంది. ఆ తర్వాత కేరళీయులు పెద్దఎత్తున స్పందించి విరాళాలు అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని