చిప్కో ఉద్యమనేత మురారి లాల్‌ మృతి

సామాజిక కార్యకర్త, చిప్కో, సర్వోదయ ఉద్యమాల నేత మురారి లాల్‌(91) శుక్రవారం రుషికేశ్‌లోని ఎయిమ్స్‌లో శ్వాస సంబంధిత సమస్యకు చికిత్స పొందుతూ మృతిచెందారు.

Published : 13 Apr 2024 05:42 IST

గోపేశ్వర్‌: సామాజిక కార్యకర్త, చిప్కో, సర్వోదయ ఉద్యమాల నేత మురారి లాల్‌(91) శుక్రవారం రుషికేశ్‌లోని ఎయిమ్స్‌లో శ్వాస సంబంధిత సమస్యకు చికిత్స పొందుతూ మృతిచెందారు. చిప్కో ఉద్యమ మాతృసంస్థ అయిన దశోలీ గ్రామ స్వరాజ్య మండల్‌కు లాల్‌ అధ్యక్షుడు. ఆయన తన స్వగ్రామంలోని బంజరు భూములను సస్యశ్యామలంగా మార్చడంతోపాటు సహజ వనరుల సంరక్షణ, వినియోగానికి సంబంధించి వినూత్న విధానాలను రూపొందించి గుర్తింపు పొందారు. లాల్‌ మృతి పట్ల పర్యావరణ వేత్త చండీ ప్రసాద్‌ భట్‌ సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంతో పాటు ఇతర సంస్థలు గుర్తించి గౌరవించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని