దిల్లీలో 22 విమానాల దారి మళ్లింపు

ప్రతికూల వాతావరణం కారణంగా దిల్లీ విమానాశ్రయంలోని 22 విమానాలను శనివారం సాయంత్రం వివిధ ప్రాంతాలకు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

Published : 14 Apr 2024 03:48 IST

ప్రతికూల వాతావరణమే కారణం

దిల్లీ: ప్రతికూల వాతావరణం కారణంగా దిల్లీ విమానాశ్రయంలోని 22 విమానాలను శనివారం సాయంత్రం వివిధ ప్రాంతాలకు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల మధ్య జైపుర్‌కు 9, లఖ్‌నవూకు-8, చండీగఢ్‌కు-2, వారణాసి, అమృత్‌సర్‌, అహ్మాదాబాద్‌ విమానాశ్రాయాలకు ఒక్కొక్కటి చొప్పున విమానాలను దారి మళ్లించామని పేర్కొన్నారు. వీటిలో తొమ్మిది ఇండిగో, ఎనిమిది ఎయిర్‌ ఇండియా, మూడు విస్తారా సంస్థలకు చెందినవని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని