అల్లుకున్న పచ్చదనం!

ఏపుగా పెరిగిన చెట్లు, పచ్చని గోడను తలపించేలా అల్లుకున్న తీగలు. చూడడానికి ఎంతో బాగున్నాయి కదూ! ఆ పచ్చదనం మధ్య ఓ అద్భుతమైన రెండంతస్తుల భారీ భవనం ఉంది.

Published : 14 Apr 2024 05:20 IST

చెట్లు, తీగలతో రెండంతస్తుల ‘గ్రీన్‌ హౌస్‌’
మైసూరులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న బెంజిమిన్‌ నివాసం

మైసూరు: ఏపుగా పెరిగిన చెట్లు, పచ్చని గోడను తలపించేలా అల్లుకున్న తీగలు. చూడడానికి ఎంతో బాగున్నాయి కదూ! ఆ పచ్చదనం మధ్య ఓ అద్భుతమైన రెండంతస్తుల భారీ భవనం ఉంది. కర్ణాటకలోని కొడగు ప్రాంతానికి చెందిన బెంజమిన్‌ 20 ఏళ్ల క్రితం మైసూరుకు వలస వచ్చారు. అక్కడే ఓ ఇంటిని నిర్మించుకుని, దాని చుట్టూ పచ్చని చెట్లను పెంచడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇంటిని పచ్చదనం కప్పేసింది. ‘‘ఈ ఇల్లు నిర్మించి సుమారు 20 ఏళ్లు అవుతోంది.

గత 10ఏళ్లుగా ఇంటి చుట్టూ అనేక రకాల చెట్లు, తీగలను పెంచుతున్నాను. ఇందులో సుమారు 10వేల రకాల మొక్కలు, తీగలు ఉన్నాయి. పాములు, దోమలు, క్రిమికీటకాలు ఇంట్లోకి రాకుండా ఉండే విధంగా కూడా కొన్ని మొక్కలను నాటాను. మొక్కలు, తీగల కారణంగా వాతావరణం చల్లగా మారి అనేక పక్షులు ఇంట్లోనే గూడు కట్టుకుని జీవిస్తున్నాయి. ఈ ఇంటిని ఓ చిన్న మ్యూజియంగా కూడా మార్చాను. సుమారు 150 పురాతన విగ్రహాలు, చిత్రపటాలు, బొమ్మలు, చేతివృత్తుల కళాఖండాలను సేకరించాను. విదేశీ బొమ్మలను సేకరించి ఇంట్లో ప్రదర్శనకు ఉంచాను’’ అని బెంజిమిన్‌ తెలిపారు. పచ్చని చెట్ల మధ్య ఉన్న ఈ ఇంట్లో వేసవి కాలంలోనూ ఎలాంటి ఏసీ, కూలర్లను వినియోగించట్లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని