ఉగ్రవాదులకు నిబంధనలు పట్టవు

గత పదేళ్లలో దేశ విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు.

Published : 14 Apr 2024 05:05 IST

వారికి బదులివ్వడంలోనూ నిబంధనలు ఉండవు: జైశంకర్‌

పుణె: గత పదేళ్లలో దేశ విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ మార్పే సరైన విధానమని తెలిపారు. ముష్కరులు ఎలాంటి నిబంధనలు పెట్టుకుని దాడులు చేయరని, అలాంటప్పుడు వారికి బదులివ్వడంలోనూ ఎలాంటి నిబంధనలు ఉండాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో జైశంకర్‌ పాల్గొన్నారు. ఉగ్రవాద ముప్పు, దేశ దౌత్య సంబంధాలు తదితర అంశాలపై యువత అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఏయే దేశాలతో సంబంధాలు కొనసాగించడం కష్టంగా ఉందని అడగ్గా.. పొరుగున ఉన్న పాకిస్థాన్‌ అని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదని దాయాది దేశాన్ని ఉద్దేశిస్తూ స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని