సంక్షిప్త వార్తలు

మోదీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం చేసింది. ఆ రాష్ట్రాలకు భారీ బడ్జెట్లు కేటాయించి, ఆ తర్వాత తక్కువ నిధులను ఖర్చు చేసిన చరిత్ర మోదీ సర్కారుది.

Published : 14 Apr 2024 05:43 IST

ఈశాన్య రాష్ట్రాలకు మోదీ అన్యాయం

మోదీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం చేసింది. ఆ రాష్ట్రాలకు భారీ బడ్జెట్లు కేటాయించి, ఆ తర్వాత తక్కువ నిధులను ఖర్చు చేసిన చరిత్ర మోదీ సర్కారుది. యూపీఏ ప్రభుత్వం 90 శాతం బడ్జెట్‌ నిధులను స్థిరంగా వినియోగించగా, మోదీ ప్రభుత్వం 60 శాతం మాత్రమే ఖర్చు చేసింది. గత పదేళ్లలో రెండు సార్లు మాత్రమే ఈశాన్య రాష్ట్రాలకు పూర్తి బడ్జెట్‌ను వినియోగించింది.

జైరాం రమేశ్‌


ప్రధాని మాటలు ఒకలా.. చేతలు మరోలా..

ప్రభుత్వానికి రాజ్యాంగం భగవద్గీత, రామాయణం, మహాభారతం, బైబిల్‌, ఖురాన్‌ లాంటిదని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో గొప్పగా చెబుతున్నారు. కానీ ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలను కూలదోయడం, అవినీతిపరులుగా ముద్రవేసినవారినే తమ పార్టీలో చేర్చుకోవడం, ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొని ఈడీ, సీబీఐలను ప్రయోగించడం, ఎన్నికల బాండ్ల ద్వారా అక్రమ సొమ్మును పోగేసుకోవడం.. ఈ జాబితాకు అంతులేదు.

కపిల్‌ సిబల్‌


ప్లాస్టిక్‌తో రాబోయే తరాలకూ ముప్పు

ఒక ప్లాస్టిక్‌ బాటిల్‌ను తయారు చేయడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. కానీ దాన్ని వాడి పడేసిన తర్వాత అది పూర్తిగా మట్టిలో కలిసిపోవడానికి 450 ఏళ్లు పడుతుంది. ప్లాస్టిక్‌ వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీనివల్ల రాబోయే తరాలపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. ప్రజలు వాటిని వినియోగించేలా ప్రోత్సహించాలి.

ఐరాస అభివృద్ధి కార్యక్రమం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని