అంబేడ్కర్‌కు రాష్ట్రపతి, ప్రధాని, సీజేఐ నివాళులు

భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా పార్లమెంటు హౌస్‌ కాంప్లెక్సులోని ఆయన విగ్రహం వద్ద రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆదివారం పుష్పాంజలి ఘటించారు.

Published : 15 Apr 2024 03:33 IST

దిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా పార్లమెంటు హౌస్‌ కాంప్లెక్సులోని ఆయన విగ్రహం వద్ద రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆదివారం పుష్పాంజలి ఘటించారు. పలువురు కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, మాజీ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్‌ హాలులో అంబేడ్కర్‌ చిత్రపటం వద్ద సైతం పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు పుష్పాంజలి ఘటించారు. ‘‘రాజ్యాంగ రూపశిల్పి, జాతి నిర్మాతల్లో ఒకరైన బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా దేశ పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఓ సందేశంలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ రాజ్యాంగ నిర్మాతకు పుష్పాంజలి సమర్పించారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని