గౌరవంగా జీవించే హక్కుకు వృద్ధాప్యం, అనారోగ్యం అడ్డుకారాదు

వృద్ధాప్యం, అనారోగ్యం వంటివి ఒక వ్యక్తి ఉపాధికి, గౌరవంగా జీవించే హక్కుకు అడ్డుకారాదని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.

Updated : 15 Apr 2024 05:57 IST

దిల్లీ హైకోర్టు వ్యాఖ్య

దిల్లీ: వృద్ధాప్యం, అనారోగ్యం వంటివి ఒక వ్యక్తి ఉపాధికి, గౌరవంగా జీవించే హక్కుకు అడ్డుకారాదని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. యజమాని వ్యాపారం చేసుకోడానికి వీలుగా ఇప్పటికే అక్కడ అద్దెకుంటున్న వ్యక్తిని ఖాళీ చేయాలంటూ అడిషనల్‌ రెంట్‌ కంట్రోలర్‌ (ఏఆర్‌సీ) ఇచ్చిన ఆదేశాలను న్యాయస్థానం సమర్థించింది. దిల్లీలోని పహాడ్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన దుకాణాన్ని మరో వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. ఇప్పుడు తానే వ్యాపారం చేసుకోడానికి ఆ దుకాణం ఖాళీ చేయాలని యజమాని కోరగా, అద్దెకుంటున్న వ్యక్తి వ్యతిరేకించాడు. యజమానికి అనుకూలంగా ఏఆర్‌సీ ఇచ్చిన ఉత్తర్వులను దిల్లీ హైకోర్టులో సవాలు చేశాడు. వృద్ధుడైన తన యజమాని అనారోగ్యంతో బాధపడుతున్నందున ఏ వ్యాపారమూ చేయలేరని పేర్కొన్నారు. ఆయనను కుమారుడు బాగానే చూసుకుంటున్నారని కోర్టుకు నివేదించారు. ఈ వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రతివాది అనారోగ్యం కారణంగా వ్యాపారం చేయలేరేమో అనే ఊహాజనిత వాదనను పరిగణనలోకి తీసుకోబోమంటూ ఏఆర్‌సీ ఉత్తర్వులను సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని