మణిపుర్‌లో ఆయుధ సేకరణ పెట్టెలు

మణిపుర్‌లోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెట్టెలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

Published : 15 Apr 2024 04:51 IST

దోపిడీ చేసిన తుపాకులను వాటిలో వేయాలంటున్న ప్రభుత్వం

ఇంఫాల్‌; చురాచాంద్‌పుర్‌: మణిపుర్‌లోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెట్టెలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో జాతుల మధ్య వైరం నెలకొన్న సమయంలో ఎత్తుకెళ్లిన ప్రభుత్వానికి చెందిన ఆయుధాలను ఆ పెట్టెల్లో వదిలిపెట్టాలంటూ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆ ఆయుధాలు పౌరుల వద్ద ఉంటే ప్రమాదకరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో వాటిని సేకరించాలని, అదే సమయంలో ఆ వ్యక్తుల గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు ఈ ఆయుధ సేకరణ పెట్టెలను ఏర్పాటు చేసింది. వాటిపై ‘సాయుధ దళాల వద్ద దోచుకున్న ఆయుధాలను దయచేసి ఈ పెట్టెల్లో వేయండి’ అన్న సందేశాలను ఉంచింది. దోపిడీకి గురైన ఆయుధాల్లో ఇంకా  4,200 ఆయుధాలు ప్రజల వద్దే ఉన్నాయని అధికార వర్గాల అంచనా. ఇంఫాల్‌ తూర్పు నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే ఇంటి వద్ద కూడా కూడా ఆయుధ సేకరణ పెట్టెను ఏర్పాటు చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని