నిర్మాణదశలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద 25 మంది కార్మికులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న రెండు అంతస్తుల భవనం కుప్పకూలగా, శిథిలాల కింద 25 మంది కూలీలు చిక్కుకున్నారు.

Updated : 15 Apr 2024 06:50 IST

యూపీలో దుర్ఘటన.. ఒకరి మృతి

ఈటీవీ భారత్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న రెండు అంతస్తుల భవనం కుప్పకూలగా, శిథిలాల కింద 25 మంది కూలీలు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద ఉన్న పలువురు కార్మికులను బయటకుతీసి ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. జనసత్‌ పోలీస్‌స్టేషను పరిధిలో ఆదివారం మధ్యాహ్నం భవనంలో కార్మికులు పనిచేస్తుండగా పైకప్పు కుప్పకూలింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని