అభిషేక్‌ బెనర్జీ హెలికాప్టర్‌లో ఐటీ సోదాలు!

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ హెలికాప్టర్‌లో ఆదాయపుపన్ను (ఐటీ) అధికారులు సోదాలు నిర్వహించినట్లు ఆదివారం ఆ పార్టీ తెలిపింది.

Updated : 15 Apr 2024 05:56 IST

కోల్‌కతా, దిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ హెలికాప్టర్‌లో ఆదాయపుపన్ను (ఐటీ) అధికారులు సోదాలు నిర్వహించినట్లు ఆదివారం ఆ పార్టీ తెలిపింది. కోల్‌కతాలోని బెహలా ఫ్లయింగ్‌ క్లబ్‌లో ఈ సోదాలు జరిగాయని, రాజకీయంగా ఎదుర్కోలేని ప్రతిపక్ష నేతలను భయపెట్టాడానికి, వేధించడానికి భాజపా పన్నిన కుట్రలో భాగమేనని పేర్కొంది. అభిషేక్‌ బెనర్జీ పశ్చిమ మేదినీపుర్‌లోని హాల్దియా వెళ్లడానికి హెలికాప్టర్‌ను సిద్ధం చేస్తున్నారని, ఈ క్రమంలోనే బెహలా ఫ్లయింగ్‌ క్లబ్‌లో ట్రయల్‌ నిర్వహిస్తున్నారని వెల్లడించింది. సరిగ్గా ఆ సమయంలోనే ఐటీ అధికారులు వచ్చి సోదాలు నిర్వహించారని తెలిపింది. ఈ సోదాల్లో అధికారులు ఏమీ గుర్తించలేదని అభిషేక్‌ బెనర్జీ ట్విటర్‌ వేదికగా తెలిపారు. ‘‘సోదాల్లో ఏమీ దొరకకపోవడంతో అసహనానికి గురైన బృందం హెలికాప్టర్‌ ఎగిరేందుకు అనుమతించలేదు. ఎందుకు అడ్డుకుంటున్నారని బెనర్జీ భద్రతా సిబ్బంది ప్రశ్నించగా.. ఐటీ అధికారులు వాగ్వాదానికి దిగారు. హెలికాప్టర్‌ను అదుపులోకి తీసుకుంటామని బెదిరించారు. ప్రతి సంచినీ తెరిపించి అణువణువూ తనిఖీ చేశారు’’ అని టీఎంసీ పేర్కొంది. బెహలా ఫ్లైయింగ్‌ క్లబ్‌లో అభిషేక్‌ బెనర్జీ హెలికాప్టర్‌లో తాము ఎలాంటి సోదాలు నిర్వహించలేదని, ఎవరినీ ప్రశ్నించలేదని ఆదాయపు పన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు తెలిపారు. అసలు హెలికాప్టర్‌లో అభిషేక్‌ బెనర్జీ లేనేలేరని స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని