ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువ వానలు

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌(జూన్‌-సెప్టెంబరు)లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) సోమవారం తెలిపింది.

Published : 16 Apr 2024 05:51 IST

 భారత వాతావరణ శాఖ వెల్లడి

దిల్లీ: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌(జూన్‌-సెప్టెంబరు)లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) సోమవారం తెలిపింది. ఆగస్టు-సెప్టెంబరు మధ్యలో లా నినా ప్రభావంతో ఎక్కువ మోతాదులో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం(1970-2020) 87 సెంటీ మీటర్లు కాగా, ఈ ఏడాది 106 శాతం అధికంగా(సుమారు 92 సెం.మీ.) వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. దశాబ్దకాలంలో ఐఎండీ వార్షిక తొలిదశ అంచనాల్లోనే సాధారణం కన్నా అధిక వర్షపాతాన్ని ప్రకటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితులు బలహీనపడుతున్నాయని, నైరుతి ప్రారంభం నాటికి వాటి ప్రభావం మరింత తగ్గుముఖం పడుతుందని ఐఎండీ తెలిపింది. సాధారణ వర్షపాతానికి 29 శాతం, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతానికి 31 శాతం, అధిక వర్షపాతానికి 30 శాతం అవకాశమున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని