నిబంధనల ప్రకారమే రాహుల్‌ హెలికాప్టర్‌ తనిఖీ

నిర్ణీత షెడ్యూల్‌ లేకుండా ప్రయాణించే విమానాలు, హెలికాప్టర్లపై ప్రామాణిక నిబంధనల ప్రకారమే నిఘా ఉంచడంతో పాటు తనిఖీ చేస్తున్నామని ఎన్నికల కమిషన్‌ (ఈసీ) వర్గాలు తెలిపాయి.

Published : 16 Apr 2024 03:55 IST

ఎన్నికల సంఘం సమర్థన

దిల్లీ: నిర్ణీత షెడ్యూల్‌ లేకుండా ప్రయాణించే విమానాలు, హెలికాప్టర్లపై ప్రామాణిక నిబంధనల ప్రకారమే నిఘా ఉంచడంతో పాటు తనిఖీ చేస్తున్నామని ఎన్నికల కమిషన్‌ (ఈసీ) వర్గాలు తెలిపాయి. తమిళనాడులో సోమవారం రాహుల్‌ గాంధీ హెలికాప్టర్‌, కొద్ది రోజుల క్రితం పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ హెలికాప్టర్‌లో సోదాలు నిర్వహించడాన్ని ఈసీ వర్గాలు సమర్థించుకున్నాయి. గగనతలం, సముద్రం, రోడ్డు రవాణా సహా అన్ని ప్రయాణ మార్గాలపైనా నిఘా ఉంచి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపాయి. అయితే, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రయాణించే విమానాలు, హెలికాప్టర్లలోనూ తనిఖీలు నిర్వహించి పారదర్శకతను చాటుకోవాలని ఈసీకి కాంగ్రెస్‌ పార్టీ సూచించింది. అధికారంలో ఉన్న వారి పట్ల ఓ విధంగా, విపక్ష నేతలతో మరో విధంగా వ్యవహరించడం తగదని ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని