అన్ని సీజన్లలో సాగు చేసేలా 93 కొత్త ఉల్లి వంగడాలు

ఉత్తర్‌ప్రదేశ్‌ కాన్పుర్‌లోని చంద్రశేఖర్‌ ఆజాద్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 93 రకాల కొత్త ఉల్లి వంగడాలను అభివృద్ధి చేశారు.

Published : 16 Apr 2024 04:38 IST

అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌ కాన్పుర్‌లోని చంద్రశేఖర్‌ ఆజాద్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 93 రకాల కొత్త ఉల్లి వంగడాలను అభివృద్ధి చేశారు. ఏటా దేశంలో ఏర్పడే ఉల్లి కొరతను అధిగమించడానికి ఇవి దోహదపడతాయని వారు చెప్పారు. వీటిని దేశవ్యాప్తంగా రైతులకు అందిస్తామన్నారు. తద్వారా రెండు వ్యవసాయ సీజన్లలోనూ (రబీ, ఖరీఫ్‌) ఉల్లి సాగుచేసే వీలుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘‘మహారాష్ట్ర, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఖరీఫ్‌ సీజన్‌లో అధికంగా ఉల్లిని సాగు చేస్తారు. యూపీలో మాత్రం ఆశించిన స్థాయిలో పండించడం లేదు. ఈ కారణంగానే ఏటా అక్టోబరు-నవంబరు సమయంలో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. యూపీ ఎక్కువగా మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త వంగడాలను రూపొందించాం’’ అని సీనియర్‌ శాస్త్రవేత్త రామ్‌ బతుక్‌ చెప్పారు. ఈ 93 రకాల ఉల్లి రకాలు.. ప్రతి సీజన్‌కు అనుకూలంగా ఉంటాయని, తెగుళ్లనూ తట్టుకోగలవని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని