2 నిమిషాలకు సరిపడా ఇంధనం ఉండగా ల్యాండింగ్‌

అయోధ్య నుంచి దిల్లీ బయల్దేరిన ఇండిగో విమానానికి ప్రమాదకర పరిస్థితి ఎదురైంది. వాతావరణం సహకరించకపోవడంతో దానిని చండీగఢ్‌కు మళ్లించారు.

Updated : 16 Apr 2024 05:38 IST

ఇండిగో విమానంలో భద్రతా వైఫల్యం
‘ఎక్స్‌’ పోస్టులో ఐపీఎస్‌ అధికారి ఆరోపణ

దిల్లీ: అయోధ్య నుంచి దిల్లీ బయల్దేరిన ఇండిగో విమానానికి ప్రమాదకర పరిస్థితి ఎదురైంది. వాతావరణం సహకరించకపోవడంతో దానిని చండీగఢ్‌కు మళ్లించారు. అయితే, అక్కడ ల్యాండింగ్‌ అయ్యేసరికి విమానంలో కేవలం రెండు నిమిషాలకు సరిపడా ఇంధనమే మిగిలి ఉందని దిల్లీ పోలీసు శాఖలో పనిచేసే డీసీపీ సతీశ్‌కుమార్‌ శనివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘విమానంలో 45 నిమిషాలకు సరిపడా ఇంధనం మాత్రమే ఉందని పైలట్‌ ప్రకటించారు. రెండు సార్లు కిందకు దింపడానికి విఫలయత్నం చేశారు. తదుపరి చేపట్టాల్సిన చర్యల విషయాన్ని పట్టించుకోకుండా చాలా సమయం వృథా చేశారు. 45 నిమిషాలకు సరిపడా ఇంధనం మాత్రమే ఉందని ప్రకటించిన 115 నిమిషాల తరువాత విమానాన్ని ల్యాండ్‌ చేశారు’’ అని అందులో పేర్కొన్నారు. విమానం కిందకు దిగాక అందులో కేవలం ఒకటి నుంచి రెండు నిమిషాలకు సరిపడా ఇంధనం మాత్రమే ఉందన్న సంగతి సిబ్బంది ద్వారా తనకు తెలిసిందని సతీశ్‌కుమార్‌ వివరించారు. మరోవైపు, దీనిపై స్పందించిన ఇండిగో.. విమానంలో సరిపడినంత ఇంధనం ఉందని, అన్ని ప్రామాణిక నిర్వహణ విధానాలను పాటించామని స్పష్టంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని