న్యాయప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలు తీసుకోలేం

న్యాయ ప్రక్రియలో, న్యాయస్థానాలకు సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకొనే చర్యలను తాము తీసుకోలేమని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Published : 17 Apr 2024 03:44 IST

రాజకీయ నేతల కేసులపై ఈసీ వివరణ

దిల్లీ: న్యాయ ప్రక్రియలో, న్యాయస్థానాలకు సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకొనే చర్యలను తాము తీసుకోలేమని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల వేళ.. విపక్ష నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈసీ ఈ మేరకు వివరణ ఇచ్చింది. అన్ని పార్టీలకు, అభ్యర్థులకు సమాన అవకాశాల కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది. రాజకీయ నేతల కేసుల విషయంలో న్యాయప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలను తాము తీసుకోలేమని తెలిపింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై దాదాపు 200 ఫిర్యాదులు (భాజపా 51, కాంగ్రెస్‌ 59, ఇతర పార్టీలు 90) అందాయని, 169 కేసుల్లో చర్యలు తీసుకున్నామని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని