మంచుగడ్డలపై యోగా

చైనాలో భారతీయుడి యోగాసనాలు విస్తృత ప్రాచుర్యం పొందుతున్నాయి. ఐక్యరాజ్య సమితి చైనా విభాగానికి నేతృత్వం వహిస్తున్న  సిద్దార్థ ఛటర్జీ.. సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలో దట్టమైన మంచులో వేస్తున్న కఠినమైన యోగాసనాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.

Published : 17 Apr 2024 05:06 IST

బీజింగ్‌: చైనాలో భారతీయుడి యోగాసనాలు విస్తృత ప్రాచుర్యం పొందుతున్నాయి. ఐక్యరాజ్య సమితి చైనా విభాగానికి నేతృత్వం వహిస్తున్న  సిద్దార్థ ఛటర్జీ.. సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలో దట్టమైన మంచులో వేస్తున్న కఠినమైన యోగాసనాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. శ్వాస సంబంధ యోగాసనాలకు మంచి స్పందన లభిస్తోంది. కొవిడ్‌-19 లాంటి వైరస్‌లను తట్టుకుని రోగ నిరోధకశక్తిని పెంచే డీప్‌ బ్రీతింగ్‌ యోగాసనాలపై ఆయన డాక్యుమెంటరీ తీశారు. నాలుగున్నర నిమిషాల ఈ డాక్యుమెంటరీలో మంచి ఆరోగ్యానికి శ్వాస ఎక్సర్‌సైజ్‌ వంటివి ఉన్నాయి. బీజింగ్‌లో గడ్డకట్టుకుపోయిన సరస్సులో ఆయన ఈ యోగాసనాలు వేశారు. ఛటర్జీ వయసు 60ఏళ్లు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని