నేను అరవింద్‌ కేజ్రీవాల్‌ను.. ఉగ్రవాదిని కాదు

తిహాడ్‌ జైలులో అధికారులు, భాజపా తనతో ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దేశ ప్రజలను ఉద్దేశించి మంగళవారం ఓ సందేశాన్ని పంపారు.

Published : 17 Apr 2024 05:06 IST

దిల్లీ సీఎం సందేశాన్ని వినిపించిన సంజయ్‌

దిల్లీ: తిహాడ్‌ జైలులో అధికారులు, భాజపా తనతో ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దేశ ప్రజలను ఉద్దేశించి మంగళవారం ఓ సందేశాన్ని పంపారు. ‘నేను అరవింద్‌ కేజ్రీవాల్‌ను..ఉగ్రవాదిని కాదు’ అన్న ఆయన మాటలను ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ ఇక్కడ జరిగిన ఓ మీడియా సమావేశంలో చదివి వినిపించారు. దుర్మార్గం, పగతో భాజపా కేజ్రీవాల్‌ను కుంగదీయాలని చూస్తోందని..వీటన్నింటిని ఎదుర్కొని ఆయన గొప్ప శక్తిగా మారతారని సంజయ్‌ సింగ్‌ అన్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కలిసేందుకు వెళ్లినప్పుడు కేజ్రీవాల్‌ను ఉగ్రవాది మాదిరిగా గాజుగోడ మధ్య నిలబెట్టారని సంజయ్‌ సింగ్‌ మండిపడ్డారు. ‘‘ప్రధాని మోదీ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అతిపెద్ద కుంభకోణమైన ఎన్నికల బాండ్ల జారీని సమర్థించుకుంటున్నారు. సుప్రీంకోర్టు సైతం ఎన్నికల బాండ్లు రాజ్యాంగ, చట్ట విరుద్ధమని తెలిపినా లెక్క చేయకుండా న్యాయస్థానాన్ని అవమానించారు. సుప్రీంకోర్టుకు, దేశ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలి’’ అని సంజయ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. 

‘దిల్లీ సీఎం.. వైద్యుడిని సంప్రదించాలంటున్నారు.. మీరేమంటారు’

తన వైద్యుడిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దిల్లీ కోర్టును అభ్యర్థించారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం.. స్పందనను తెలియజేయాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కు సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని