భారత ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నాం: జర్మనీ

భారత సార్వత్రిక ఎన్నికలను తాము ఆసక్తిగా గమనిస్తున్నట్లు జర్మనీ తెలిపింది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ ప్రక్రియను గౌరవిస్తున్నట్లు పేర్కొంది.

Published : 17 Apr 2024 05:07 IST

దిల్లీ: భారత సార్వత్రిక ఎన్నికలను తాము ఆసక్తిగా గమనిస్తున్నట్లు జర్మనీ తెలిపింది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ ప్రక్రియను గౌరవిస్తున్నట్లు పేర్కొంది. దిల్లీలో ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో.. మన దేశంలో జర్మనీ రాయబారి ఫిలిప్‌ అకెర్‌మాన్‌ మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ/కూటమి గెలిచినా అంతర్జాతీయ వేదికపై భారత్‌ ప్రభావం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని