12వ తరగతి తర్వాత మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు అనుమతివ్వాలి

ఇంటర్మీడియట్‌ లేదా 12వ తరగతి తర్వాత నేరుగా మూడేళ్ల లా కోర్సు (ఎల్‌ఎల్‌బీ) చదివేందుకు అవకాశం ఉండాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రస్తుతం... డిగ్రీ పూర్తి చేసిన వారు మూడేళ్ల లా కోర్సులో, ఇంటర్‌ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు అయిదేళ్ల లా కోర్సులో చేరడానికి అర్హులు.

Published : 17 Apr 2024 05:01 IST

సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు

దిల్లీ: ఇంటర్మీడియట్‌ లేదా 12వ తరగతి తర్వాత నేరుగా మూడేళ్ల లా కోర్సు (ఎల్‌ఎల్‌బీ) చదివేందుకు అవకాశం ఉండాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రస్తుతం... డిగ్రీ పూర్తి చేసిన వారు మూడేళ్ల లా కోర్సులో, ఇంటర్‌ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు అయిదేళ్ల లా కోర్సులో చేరడానికి అర్హులు. అయితే, ఇంటర్‌ తర్వాత నేరుగా మూడేళ్ల కోర్సుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని నియమించేలా కేంద్రం, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మేధావులైన విద్యార్థులు మూడేళ్లలోనే న్యాయవాద కోర్సును పూర్తి చేయగలరని, ప్రస్తుత విధానం వల్ల అయిదేళ్ల కోర్సుతో వారికి సమయం వృథా అవుతుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని