70 ఏళ్లలో తొలిసారి.. తుంగభద్ర క్రస్ట్‌ గేట్ల పటిష్ఠత పనులు

తుంగభద్ర జలాశయం క్రస్ట్‌ గేట్లను మరింత దృఢంగా మార్చే పనులు చురుగ్గా సాగుతున్నాయి.

Published : 17 Apr 2024 06:02 IST

హొసపేటె, న్యూస్‌టుడే: తుంగభద్ర జలాశయం క్రస్ట్‌ గేట్లను మరింత దృఢంగా మార్చే పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుతం జలాశయంలో 3.5 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. మరమ్మతులు, ఇతర పనులు చేయటానికి ఇదే అనువైన సమయం కావడంతో తుంగభద్ర మండలి ఈ మేరకు శ్రీకారం చుట్టింది. జలాశయం నిర్మించి దాదాపు 70 ఏళ్లవుతుంది. అప్పటి నుంచి ఇలాంటి పనులు చేపట్టడం ఇదే ప్రథమం. జలాశయంలో జలాలు తగ్గిపోగానే నిర్వహణ పనులు చేపడతారు. జలాశయం రక్షణ గోడలు, 33 క్రస్ట్‌ గేట్లలో స్యాండ్‌ బ్లాస్టింగ్‌, దృఢత్వ పనులు మరో నెలలోగా ముగియనున్నాయి. ఏటా నీటి తాకిడితో గేట్లు, రక్షణ గోడల వద్ద నాచు ఏర్పడుతోంది. నానాటికీ దాని ప్రభావం ఎక్కువవుతున్న నేపథ్యంలో స్యాండ్‌ బ్లాస్టింగ్‌ ద్వారా నాచు తొలగించే పనులు చేపట్టారు. దీంతో క్రస్ట్‌ గేట్లు, జలాశయం రక్షణ గోడలకు కొత్త వన్నె వచ్చే అవకాశం ఉంది. కర్ణాటకతోపాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనూ తుంగభద్ర జలాలు పారుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని