ముంబయి మహిళకు పాక్‌లో చిత్రహింసలు

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్‌ పోలీసులు బుధవారం వెల్లడించారు.

Published : 18 Apr 2024 05:14 IST

 లాహోర్‌లో కేసు నమోదు.. పరారీలో భర్త 

లాహోర్‌: పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్‌ పోలీసులు బుధవారం వెల్లడించారు. తన పాస్‌పోర్టు స్వాధీనం చేసుకొని, అక్రమంగా నిర్బంధించి హింసిస్తున్నట్లు ఫర్జానా బేగం అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్త మీర్జా యూసుఫ్‌ ఇలాహీపై కేసు నమోదు చేశామని పోలీసు అధికారి మహమ్మద్‌ అబ్బాస్‌ తెలిపారు. నిందితుడి అరెస్టు కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ముంబయికి చెందిన ఫర్జానా అబుధాబీలోని దుకాణంలో పనిచేసేది. 2015లో మీర్జాతో వివాహమైంది. 2018లో వీరి కాపురం లాహోర్‌కు మారింది. ఫర్జానాను భర్త చిత్రహింసలు పెడుతూ భారత్‌కు తిరిగి వెళ్లిపోవాలని ఒత్తిడి తెచ్చేవాడు. ఓసారి ఇద్దరు పోలీసుల సాయంతో వాఘా సరిహద్దు వరకు తరలించినా, అక్కడున్న అధికారులకు తన గోడు చెప్పుకొని మళ్లీ వెనక్కు వెళ్లింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని