జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్‌ యాత్రలు: ఇస్రో ఛైర్మన్‌

చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్‌ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు.

Published : 18 Apr 2024 05:15 IST

అహ్మదాబాద్‌: చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్‌ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. గత ఏడాది చందమామ దక్షిణ ధ్రువం వద్ద దిగిన చంద్రయాన్‌-3 నుంచి డేటా సేకరించామని, వాటిపై పరిశోధన పత్రాల ప్రచురణ తాజాగా ప్రారంభమైందని తెలిపారు. ‘‘చందమామపై భారత వ్యోమగామిని దించేలోగా చాలారకాల పరిజ్ఞానాలపై పట్టు సాధించాల్సి ఉంటుంది. జాబిల్లిపైకి వ్యోమనౌకను పంపి, తిరిగి రప్పించడం వంటివన్నమాట. ఈ తరహా ప్రయోగాన్ని తదుపరి యాత్రలో చేపడతాం’’ అని తెలిపారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆస్ట్రోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో సోమనాథ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని