పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి

పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి.

Published : 18 Apr 2024 05:17 IST

 ప్రజలకు 70కి పైగా బృందాల పిలుపు

దిల్లీ: పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. ఈ జాబితాలో నేషనల్‌ అలియన్స్‌ ఆఫ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్స్‌, పీపుల్‌ ఫర్‌ ఆరావళీస్‌, యూత్‌ ఫర్‌ హిమాలయా, క్లైమేట్‌ ఫ్రంట్‌ ఇండియా, ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ తదితర బృందాలు ఉన్నాయి. గత కొన్నేళ్లలో జీవన నాణ్యత ఎలా ఉంది? భావ ప్రకటన స్వేచ్ఛ పరిస్థితేంటి? ఉపాధి కల్పన ఏ స్థాయిలో ఉంది? పౌర హక్కుల పరిరక్షణ జరుగుతోందా? వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఓటు వేయాలని అవి ప్రజలను కోరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని