దేశ జనాభా 144 కోట్లు

దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ (యూఎన్‌ఎఫ్‌పీఏ) స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌-2024 నివేదికలో అంచనా వేసింది.

Published : 18 Apr 2024 05:20 IST

యూఎన్‌ఎఫ్‌పీఏ నివేదికలో అంచనా

దిల్లీ: దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ (యూఎన్‌ఎఫ్‌పీఏ) స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌-2024 నివేదికలో అంచనా వేసింది. అందులో 24శాతం మంది 0-14 ఏళ్ల వయస్సు వారేనని పేర్కొంది. 10 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్నవారు 17శాతం మంది, 10-24 ఏళ్ల వయసు ఉన్నవారు 26 శాతం, 15-64 ఏళ్ల వయసు ఉన్న వారు 68శాతం, 65 ఏళ్లు ఆపై ఉన్నవారు 7శాతం ఉండొచ్చని నివేదికలో తెలిపింది. పురుషుల జీవిత కాలం 71 ఏళ్లు కాగా.. స్త్రీల జీవిత కాలం 74ఏళ్లు ఉంటుందని తెలిపింది. 144.17 కోట్ల జనాభాతో భారత్‌ అగ్రస్థానంలో, 142.5 కోట్లతో చైనా రెండో స్థానంలో ఉంటాయని వెల్లడించింది. అలాగే 2006 నుంచి 2023 మధ్య బాల్య వివాహాల శాతం 23గా ఉండగా.. ప్రసూతి మరణాల రేటు గణనీయంగా తగ్గిందని నివేదికలో స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని